CDAP: యువత కలలను నిజం చేస్తున్న "సీడాప్"

సీడాప్ శిక్షణతో జర్మనీలో ఉద్యోగాలు.. జర్మనీలో ఉద్యోగాలు సాధించిన 14 మంది... అభినందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్

Update: 2025-09-08 03:30 GMT

“వి­దే­శా­ల్లో నర్సిం­గ్ ఉద్యో­గం చే­యా­లి” అనే లక్ష్యం­తో ప్ర­యా­ణం ప్రా­రం­భిం­చిన గ్రా­మీణ యువత, ఇప్పు­డు ఆ కలను నిజం చే­సు­కుం­టు­న్నా­రు. సీ­డా­ప్ సం­స్థ ద్వా­రా ఉచి­తం­గా జర్మ­న్ భాషా శి­క్షణ పొం­ది, పలు­వు­రు యు­వ­తీ­యు­వ­కు­లు జర్మ­నీ­లో నర్సిం­గ్ ఉద్యో­గా­లు పొం­దా­రు. రూ­పా­యి ఖర్చు లే­కుం­డా భాషా శి­క్షణ, వసతి, ఆహా­రం కల్పిం­చ­డం వల్ల తాము ఈ అవ­కా­శా­న్ని అం­దు­కు­న్నా­మ­ని తె­లి­పా­రు. సీ­డా­ప్ శి­క్ష­ణ­తో­జ­ర్మ­నీ­లో ఉద్యో­గా­లు పొం­దిన యు­వ­త­ను ఉం­డ­వ­ల్లి ని­వా­సం­లో ఏపీ మం­త్రి నారా లో­కే­శ్ అభి­నం­దిం­చా­రు. సీ­డా­ప్ ద్వా­రా 5 ఏళ్ల­లో 50 వేల మం­ది­కి వి­దే­శీ ఉద్యో­గా­లు లక్ష్యం­గా పని చే­స్తు­న్నా­మ­ని ఈ సం­ద­ర్భం­గా లో­కే­శ్ తె­లి­పా­రు. ఐదే­ళ్ల­లో 20 లక్షల ఉద్యో­గాల కల్ప­న­కు ప్ర­ణా­ళి­కా­బ­ద్ధం­గా కృషి చే­స్తు­న్న­ట్లు స్ప­ష్టం చే­శా­రు. అం­త­ర్జా­తీయ స్థా­యి అవ­కా­శా­ల­కు సీ­డా­ప్ ద్వా­రా శి­క్షణ ఇస్తు­న్న­ట్లు.. ఇకపై చదు­వు­తో­పా­టే వి­దే­శీ భా­ష­ల్లో శి­క్షణ ఇచ్చే­లా చర్య­లు చే­ప­ట్ట­ను­న్న­ట్లు మం­త్రి నారా లో­కే­శ్ ప్ర­క­టిం­చా­రు.

జర్మనీలో ఉద్యోగాలు

సొ­సై­టీ ఫర్ ఎం­ప్లా­య్ మెం­ట్ జన­రే­ష­న్ & ఎం­ట­ర్ ప్రై­జ్ డె­వ­ల­ప్మెం­ట్ ఇన్ ఆం­ధ్ర ప్ర­దే­శ్, ఇండో యూరో సిం­క్ర­నై­జే­ష­న్ & జర్మ­న్ హె­ల్త్ కేర్ సం­యు­క్త భా­గ­స్వా­మ్యం­తో అం­త­ర్జా­తీయ ప్లే­స్ మెం­ట్ పథకం (నర్సిం­గ్ ప్రొ­ఫె­ష­న­ల్స్) కింద 14మంది నర్సిం­గ్, హె­ల్త్ కేర్ ప్రొ­ఫె­ష­న­ల్స్ కి జర్మ­నీ­లో­ని ప్ర­ముఖ ఆసు­ప­త్రు­ల్లో ఉద్యో­గా­లు కల్పి­స్తూ కాల్ లె­ట­ర్స్ అం­దా­య­ని తె­లి­పా­రు. తొ­లి­బ్యా­చ్ లో సీ­డా­ప్ ద్వా­రా మొ­త్తం 171 మం­ది­కి శి­క్షణ ఇవ్వ­గా, ఇప్ప­టి­కే వి­విధ వి­భా­గా­ల్లో 40 మంది ఎం­పి­క­య్యా­ర­ని, వా­రి­లో 14 మంది త్వ­ర­లో­నే జర్మ­నీ వె­ళ్తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. మి­గి­లిన అభ్య­ర్థు­లు కూడా వి­విధ దశ­ల్లో శి­క్షణ పూ­ర్తి చే­స్తు­న్నా­ర­ని, వా­రి­కి త్వ­ర­లో­నే ఉద్యోగ అవ­కా­శా­లు లభి­స్తా­య­న్నా­రు. మన రా­ష్ట్రం­లో­ని బి­డ్డ­ల­కు అం­త­ర్జా­తీ­య­స్థా­యి ఉద్యో­గాల కల్పిం­చా­ల­న్న­ది సీఎం చం­ద్ర­బా­బు లక్ష్యం అని. ఆ లక్ష్యా­ని­కి అను­గు­ణం­గా సీ­డా­ప్- ఓం­క్యా­ప్ లను బలో­పే­తం చే­స్తు­న్నా­మ­ని లో­కే­శ్ వె­ల్ల­డిం­చా­రు.

రూ.2.8లక్షల ఉద్యోగం కలగా ఉంది..

బీ­ఎ­స్సీ నర్సిం­గ్‌ కో­ర్సు పూ­ర్తి చేసి, స్థా­నిక ఆసు­ప­త్రు­ల్లో నె­ల­కు రూ.15 వేల నుం­చి రూ.20వే­ల­కు పని చేసే తమకు జర్మ­నీ­లో రూ.2.8లక్షల వే­త­నం­తో ఉద్యో­గం లభిం­చ­డం కలగా ఉం­ద­ని పే­ర్కొం­టూ అభ్య­ర్థు­లు భా­వో­ద్వే­గా­ని­కి గు­ర­య్యా­రు. ఉద్యో­గా­లు సా­ధిం­చిన 14మం­ది­లో 9మంది ని­రు­పేద ఎస్సీ కు­టుం­బా­ల­కు చెం­దిన వారు.. ము­గ్గు­రు బీ­సీ­లు ఉన్నా­రు. జర్మ­నీ­లో ఇవే ఉద్యో­గాల కోసం కన్స­ల్టె­న్సీ­ల­ను శి­క్షణ కోసం సం­ప్ర­ది­స్తే రూ.8 లక్షల వరకు అడి­గా­ర­ని, అంత డబ్బు చె­ల్లిం­చే ఆర్థిక స్తో­మత తమకు లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. సీ­డా­ప్‌ ద్వా­రా ఒక్క రూ­పా­యి తీ­సు­కో­కుం­డా జర్మ­న్‌ భా­ష­లో శి­క్షణ ఇచ్చి, ఉద్యో­గం వచ్చే­లా చే­శా­ర­ని తె­లి­పా­రు. తమ కలను సా­కా­రం చే­సిన సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి లో­కే­శ్‌­ల­ను జీ­వి­తం­లో ఎప్ప­టి­కీ మర్చి­పో­లే­మ­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో సీ­డా­ప్‌ ఛై­ర్మ­న్‌ దీ­ప­క్‌­రె­డ్డి, సీఈఓ నా­రా­య­ణ­స్వా­మి, నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి సం­స్థ ఎండీ గణే­ష్‌­కు­మా­ర్‌ పా­ల్గొ­న్నా­రు.

విదేశీ భాషలపై శిక్షణ

చదు­వు పూ­ర్త­య్యాక కా­కుం­డా చదు­వు­లో భా­గం­గా­నే జర్మ­న్‌, జప­నీ­స్‌ లాం­టి వి­దే­శీ భా­ష­ల­పై శి­క్షణ ఇస్తా­మ­ని మం­త్రి లో­కే­శ్‌ తె­లి­పా­రు. యువత అం­త­ర్జా­తీయ స్థా­యి ఉద్యో­గా­లు సా­ధిం­చా­ల­నే­ది సీఎం చం­ద్ర­బా­బు లక్ష్య­మ­ని, అం­దు­కు అను­గు­ణం­గా వా­రి­కి శి­క్షణ అం­దు­తోం­ద­న్నా­రు. అం­త­ర్జా­తీయ స్థా­యి అవ­కా­శా­ల­ను మన వి­ద్యా­ర్థు­లు అం­ది­పు­చ్చు­కు­నే­లా సీ­డా­ప్‌, ఓం­క్యా­ప్‌ సం­స్థల ద్వా­రా వి­దే­శీ భా­ష­ల­పై శి­క్షణ ఇస్తు­న్నా­మ­న్నా­రు. ఈనె­ల­లో­నే నై­పు­ణ్యం పో­ర్ట­ల్‌­ను ప్రా­రం­భి­స్తా­మ­ని లో­కే­శ్‌ తె­లి­పా­రు.

నిరుద్యోగులను మోసం చేసిన జగన్

‘వై­సీ­పీ ప్ర­భు­త్వం వి­ద్యా­రం­గా­న్ని పూ­ర్తి­గా దె­బ్బ­తీ­సిం­ది. అం­దు­కు కేం­ద్రం వి­డు­దల చే­సిన అసర్ ని­వే­ది­కే సా­క్ష్యం. వై­సీ­పీ ప్ర­భు­త్వం వి­ద్యా­ర్థుల జీ­వి­తా­ల­తో ఆడు­కుం­ది అన­డా­ని­కి అసర్ ని­వే­దిక ఒక ఉదా­హ­రణ’అని సీ­డా­ప్ చై­ర్మ­న్ దీ­ప­క్ రె­డ్డి అన్నా­రు. ‘దేశం మొ­త్తం ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల్లో చది­వే మూడో తర­గ­తి చి­న్నా­రు­ల్లో రెం­డో­త­ర­గ­తి పా­ఠ్య­పు­స్త­కా­ల­నై­నా తడ­బ­డ­కుం­డా చది­వే సా­మ­ర్థ్యం 2022లో 16.3% ఉం­డ­గా...2024 నా­టి­కి 23.4%కి చే­రిం­ది. అం­దు­కు భి­న్నం­గా మన రా­ష్ట్రం­లో మూడో తర­గ­తి­లో ఉండి రెం­డో తర­గ­తి పు­స్త­కా­లు చద­వ­డం వచ్చిన వి­ద్యా­ర్థు­లు 2018లో 22.6 శాతం ఉంటే 2024లో 14.7 శా­తా­ని­కి తగ్గా­రు. ఇది జగన్ రె­డ్డి పాలన డొ­ల్ల­త­నం. కేం­ద్రం వి­డు­దల చే­సిన అసర్ ని­వే­దిక ఈ వి­ష­యా­ల­ను చె­ప్పిం­ది.రా­ష్ట్రం­లో ఐదో తర­గ­తి చదు­వు­తూ రెం­డో తర­గ­తి పు­స్త­కా­లు చద­వ­డం వచ్చిన వా­ళ్లు 2018లో 57.1 శాతం ఉం­డ­గా 2024లో 37.5 శా­తా­ని­కి తగ్గా­ర­ని అసర్ ని­వే­దిక వె­ల్ల­డిం­చిం­ది’అని సీ­డా­ప్ చై­ర్మ­న్ దీ­ప­క్ రె­డ్డి ఆరో­పిం­చా­రు.

Tags:    

Similar News