Narayana Swamy : ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

Narayana Swamy : ఒంగోలులో పర్యటించిన కేంద్రమంత్రి నారాయణస్వామి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా వ్యంగ్యస్త్రాలు సంధించారు

Update: 2022-09-13 09:05 GMT

Narayana Swamy  : ఏపీ రాజధానిపై కేంద్రమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత.. పార్లమెంట్‌కు పంపిస్తే బిల్లుపై చర్చించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంద్నారు. ఒంగోలులో పర్యటించిన కేంద్రమంత్రి నారాయణస్వామి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఐదు, ఆరు మంది ఎంపీలున్న నాయకుడు దేశ ప్రధాని అయిపోతారా? అని చురకలంటించారు. కేసీఆర్‌ పిచ్చి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణలోని సమస్యలను కేసీఆర్ పరిష్కరించాలని కేంద్రమంత్రి నారాయణస్వామి స్పష్టంచేశారు.

Tags:    

Similar News