"ప్రజలను సర్వనాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నాడు"
రావణాసురుడు సాధువు వేషంలో సీతను అపహరిస్తే.... జగన్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ తన నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు.;
ప్రజలను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న జగన్‌ను.. ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మహానాడులో తన ప్రసంగంతో చంద్రబాబు అదరగొట్టారు. టీడీపీ శ్రేణుల ఉర్రూతల మధ్య వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రావణాసురుడు సాధువు వేషంలో సీతను అపహరిస్తే.... జగన్ కూడా ఒక్క ఛాన్స్ అంటూ తన నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా మనం సంకల్పం చేయాలన్న చంద్రబాబు.. తీవ్రంగా నష్టపోయిన ఏపీని రాబోయే 5ఏళ్లలో బ్రహ్మాండంగా చేసేందుకు రాజమహేంద్రవరం నుంచి నాంది పలుకుదామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్న చంద్రబాబు.. మొదటి విడత మేనిఫెస్టో రాజమహేంద్రవరం నుంచే ప్రకటిస్తామన్నారు.