CBN: సదరం సర్టిఫికెట్లపై చంద్రబాబు ఆగ్రహం

చర్యలు తీసుకోవాలని ఆదేశం... ప్రభుత్వాసుపత్రులు బెస్ట్‌ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని సూచన;

Update: 2024-08-13 00:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్‌ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై.. చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నకిలీ సదరం సర్టిఫికెట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. నకిలీ సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని చంద్రబాబు అన్నారు. పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరం సర్టికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే బెస్ట్ హాస్పిటళ్లుగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు.

నకిలీ సదరం సర్టిఫికెట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నకిలీ సదరం ధ్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ధ్రువపత్రాలపై పూర్తి సమాచారం సేకరించాలని.. పంచాయతీ రాజ్‌ శాఖ సమన్వయంతో నకిలీ పత్రాలు కట్టడి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆస్పత్రికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ, పీపీపీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తెస్మన్నారు. ప్రభుత్వం తరఫున యాప్‌ రూపొందించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని.. టెలి మెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని.. రోగులకు శుభ్రమైన బెడ్ షీట్లు అందించాలన్నారు. రాష్ట్రంలో డోలీ మోతలు కనిపించకూడదన్నారు. ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు. ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినా.. సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానన్నారు.104 అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని సీఎం వెల్లడించారు. ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరి కాదన్నారు.

Tags:    

Similar News