Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు…

Update: 2024-06-05 04:00 GMT

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు 10 గంటలకు ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. అనంతరం దిల్లీకి పయనం కానున్నారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొని రాత్రికి అమరావతి రానున్నారు. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు సీఎస్ జవహర్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మర్యాదపూర్వకంగా కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరారు. 

ఆంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు... ఈనెల 9న ప్రమాణాస్వీకారం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. నేడు దిల్లీ వెళ్లనున్న చంద్రబాబు... ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొననున్నారు. అయితే.. చంద్రబాబు దిల్లీ వెళ్లే ముందు మర్యాద పూర్వకంగా సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీష్‌ గుప్త కలవనున్నారు. అంనంతరం దిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం తేదీని చంద్రబాబు సమన్వయం చేసుకుని, రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం నిర్ణయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డ్ సొంతం చేసుకోవడంతో పాటు మొత్తంగా 14 ఏళ్ల పాటు సీఎం బాధ్యతలు చేపట్టిన ఏకైక సీఎంగా తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయం నమోదు చేసినందుకు నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. 

Tags:    

Similar News