అక్టోబర్ 2న మన విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ). వికసిత ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం కావాలనీ.. అక్టోబర్ 2న మన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తామని కలెక్టర్ల సమావేశంలో చెప్పారు.
"కలెక్టర్లు డిస్ట్రిక్ విజన్ డాక్యుమెంట్ తయారుచేయాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. ఇప్పటికే 6 సంతకాలు పెట్టాం. 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను పెట్టబోతున్నాం. ఆర్థికేతర సమస్యలను ముందుగా పరిష్కరించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలి. తద్వారా మంచి మార్పు వస్తుంది." అని చెప్పారు.
త్వరలోనే మళ్లీ 1995 చంద్రబాబు నాయుడును చూస్తారనీ.. హైదరాబాద్, ఐటీ అభివృద్ధిని అధికారులే చేశారని అన్నారు బాబు. ఎంత పెట్టుబడులు పెట్టారన్నది కాదు ఎంత మందికి ఉపాధి కల్పించామన్నది ముఖ్యమన్నారు చంద్రబాబు.