CM Chandrababu : నేతన్నలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Update: 2025-08-06 17:00 GMT

చేనేత రంగానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నేతన్నలను ఆదుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలపై చర్చించారు. వ్యవసాయం తర్వాత చేనేతే అత్యంత కీలకమైనదని.. నేతన్నలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. మగ్గాలకు 200 యూనిట్లు, అలాగే పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు చేపట్టాల్సిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలోనూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని చెప్పారు. దీంతో చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. చేనేత వస్త్రాలపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా సీఎం చంద్రబాబు అ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నిర్ణయాలతో చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు.

Tags:    

Similar News