Chandrababu Naidu : ప్రజల్లోకి సంక్షేమ ఫలాలు.. లక్ష్యాన్ని నిర్దేశించిన సీఎం చంద్రబాబు

Update: 2025-09-30 12:15 GMT

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వారితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించడం ద్వారానే వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. "ప్రజలతో మమేకమే కాదు.. మంచి పేరు తెచ్చుకోవాలి. పార్టీకి ప్రజాప్రతినిధులు, నేతలే ప్రతినిధులు. మీ వ్యవహారశైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి" అని అన్నారు.

సమర్థ పాలన vs అసమర్థ పాలన గత ప్రభుత్వ అసమర్థ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ సమర్థ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని ఆయన నేతలను ఆదేశించారు. "గత ప్రభుత్వం ట్రూఅప్‌ పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచింది. కానీ మన కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ పేరుతో ఛార్జీలను తగ్గించింది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి" అని సూచించారు.

సోలార్, విండ్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టిపెట్టామని తెలిపారు. అలాగే జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లాభాలను కూడా ప్రజలకు వివరించాలని కోరారు. "కూటమి బలోపేతం కావాలి"  "ప్రజలు మనవైపు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీరు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలోపేతం కావాలి" అని చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టం చేశారు. కూటమి నేతలు నిబద్ధతతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News