డిక్లరేషన్‌ ఇవ్వకుండానే శ్రీవారి ఆలయంలోకి సీఎం జగన్‌

అర్చకులు సంప్రదాయ బద్ధంగా సీఎంకు తలపాగా చుట్టారు

Update: 2020-09-23 15:48 GMT

వివాదాల మధ్యే సీఎం జగన్‌ తిరుమల పర్యటన సాగుతోంది. అయితే... డిక్లరేషన్‌ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం జగన్‌. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ వస్తధారణతో నుదుట తిరు నామాలు పెట్టుకున్న సీఎం జగన్‌.. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు సంప్రదాయ బద్ధంగా సీఎంకు తలపాగా చుట్టారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనాలు తీసుకున్నారు.

అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు సీఎం జగన్‌. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి మళ్లీ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతికి పయనమవుతారు.

Tags:    

Similar News