వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్రారెడ్డిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తనపై నెల రోజుల క్రితం ఫేస్‌బుక్ వేదికగా అసభ్యకర పోస్టు పెట్టాడని తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు చేశారు.