తెనాలిలో కరోనా కలకలం.. కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులకు పాజిటివ్
మారిస్‌పేటలోని జీవనజ్యోతి నర్సింగ్ కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులు వైరస్ బారిన పడ్డారు.;
గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. నిన్న ఒక్కరోజే పట్టణంలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..మారిస్‌పేటలోని జీవనజ్యోతి నర్సింగ్ కాలేజ్‌లో 11 మంది విద్యార్థినులు వైరస్ బారిన పడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఈ కాలేజ్‌లో నర్సింగ్ కోర్స్ చేస్తున్నారు.. తెనాలిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కాలేజీలు, స్కూళ్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..