CPI Narayana : రాజన్న మాటకి పంగనామం పెట్టారు : సీపీఐ నారాయణ
CPI Narayana : సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ;
CPI Narayana : సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చిత్తూరులో రైతు సదస్సులో పాల్గొన్న ఆయన... వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజన్న పాలన తెస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు రాజన్న మాటకు పంగనామం పెట్టారంటూ విమర్శించారు. రైతు మోటార్లకు మీటర్ల బిగించేవారి చేతులు నరుకుతామంటూ మండిపడ్డారు. తెలంగాణలో రైతు మోటార్లకు మీటర్లు పెడితే.. తానే పగలగొడతామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని.. ఆ ధైర్యం కూడా జగన్‌కు లేదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్... కేంద్రానికి భయపడుతున్నారని అన్నారు.