RAINS: దానా ఎఫెక్ట్.. ఒడిశా అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రోజులు భారీ వర్షాలు.... అప్రమత్తమైన అధికార యంత్రాంగం;
ఒడిశాలోని భితర్కనికా -ధమ్రా సమీపంలో దానా తుపాను తీరం దాటింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీఒడిశాలోని బిత్తర్‌కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య రం దాటింది. తుపాను తీరం దాటే సమయంలో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. గాలుల దాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. తుపాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం 9 గంటల వరకు మూసి ఉంచనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ పశ్చిమబెంగాల్లో గురువారం భారీవర్షాలతో ఈదురుగాలులు వీచాయి. రాష్ట్రప్రభుత్వం తీరప్రాంతాల్లోని 3.5 లక్షలమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు. తాను రాత్రంతా రాష్ట్ర సచివాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షించనున్నట్లు మమత చెప్పారు. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిస్ అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఒడిశాలో నాలుగు జిల్లాలకు రెడ్ ఎలర్ట్
దానా’ తుపాను ధాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. బాలేశ్వర్, భద్రక్, కేంద్రపడ, జగత్సింగ్పుర్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీచేశారు. లోతట్టు ప్రాంతాల్లోని 10 లక్షలమందిని తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఒడిశా సీఎంకు ఫోను చేసి రాష్ట్రంలో తుపాను సన్నద్ధతపై ఆరాతీశారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలను శుక్రవారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో వందల సంఖ్యలో విమాన సర్వీసులపై ప్రభావం పడింది.
దానా తుపానుపై ఎమ్మెల్యే సమీక్ష
దానా తుపాను కారణంగా ఇచ్చాపురం తహసీల్దారు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ తుపాను ప్రభావాన్ని తట్టుకొనేందుకు అధికారులంతా సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు పాల్గొన్నారు.