బొబ్బిలి కోటలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా బొబ్బిలి కోటలో రాజుల కాలం నాటి ఆయుధాలకు పూజలు జరిపి.. తరువాత స్థానికుల దర్శనం కోసం ఉంచారు. బొబ్బిలి యుద్ధంతో పాటు రాజరిక వ్యవస్థలో రాజులు ఉపయోగించిన ఆయుధాలను బయటకు తీసి శుభ్రపరిచి పూజలు జరిపారు. వారసులైన సుజయ కృష్ణ రంగారావు, బేబినాయనల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో రాజకుటుంబీకులతో పాటు అభిమానులు పాల్గొని ఆయుధ ప్రదర్శన ను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. రాజులు మాట్లాడుతూ తమ పూర్వీకులు వాడిన ఆయుధాలను ఎంతో జాగ్రత్తగా పరీక్షించి భవిష్యత్తు తరాల వారికి చరిత్రను గుర్తు చేయటమే తమ ఆశయమన్నారు.