పారిశుద్ధ్య కార్మికుడిపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే దాడి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తనపై దాడి చేశారంటూ పెదవేగి పోలీసులను ఆశ్రయించాడు పారిశుద్ధ్య కార్మికుడు గంగాధరరావు.

Update: 2021-04-06 13:27 GMT

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తనపై దాడి చేశారంటూ పెదవేగి పోలీసులను ఆశ్రయించాడు పారిశుద్ధ్య కార్మికుడు గంగాధరరావు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదనే కోపంతో విధుల్లో ఉన్న తనపై చేయి చేసుకున్నారని వాపోయాడు. చెత్తబండిపై ఉన్న తనను దుర్భాషలాడి, దాడి చేశారని ఆరోపిస్తున్నాడు. కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు గంగాధరరావు. 

Tags:    

Similar News