ఏపీలో మరో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు
ఏపీలో ఆలయాల విధ్వంసానికి అడ్డుకట్టపడటం లేదు. తాజాగా మరో ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. కర్నూలు జిల్లా కోసిగిలో ఈ ఘటన జరిగింది.;
ఏపీలో ఆలయాల విధ్వంసానికి అడ్డుకట్టపడటం లేదు. తాజాగా మరో ఆలయాన్ని ధ్వంసం చేశారు దుండగులు. కర్నూలు జిల్లా కోసిగిలో ఈ ఘటన జరిగింది. మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలోని గోపురంలోని సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అంతేకాదు గుడి ముఖద్వారం ఇనుప కడ్డీలు కట్ చేసి హుండీని సైతం దొంగలించారు. సీతారాముల విగ్రహం కాళ్లను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.