TTD: వైవీ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన
TTD: తిరుమలలోని TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు.;
తిరుమలలోని TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. టికెట్ల కోసం గంటల తరబడి వేచి ఉన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాల్సిన వారికి ముందుగానే టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఉదయం నుంచి వేచి చూస్తున్నా కనికరించడం లేదని ధ్వజమెత్తారు.