టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ఈరోజు(సోమవారం) పోలీసుల విచారణకు హాజరు కాలేనని ఆర్జీవీ తన అడ్వకేట్ శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. కారణాలను ఒంగోలు పోలీసులకు చెబుతానని తెలిపారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టారని మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ విచారణకు డుమ్మా కొట్టడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు హాజరుకాని పక్షంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. దానికి తగ్గట్లే ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్‌లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. విచారణకు హాజరు కావాలని లేకపోతే అరెస్ట్ చేస్తామని ఆర్జీవీకి పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రామ్ గోపాల్ వర్మ మిస్సింగ్.. ?
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన నివాసం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఆర్జీవీ ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు. కాగా, ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదైంది.
పోలీసులపై ఆర్జీవీ లాయర్ ఆగ్రహం
ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు రావడంపై ఆయన లాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మకు పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇచ్చారని.. రెండు నోటీసులకు తాము సమాధానం ఇచ్చామమని వెల్లడించారు. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు.. డీఎస్పీకి వాట్సాప్ ద్వారా తెలిపామని.. అయినా పోలీసులు ఆర్జీవీ ఇంటికి రావడం కరెక్ట్ కాదన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉందన్నారు. రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఒంగోలు రూరల్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాల్సి ఉంది.