ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విజయవాడకు డ్రోన్‌ బృందం

ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విజయవాడకు డ్రోన్‌ బృందం

Update: 2020-08-31 05:24 GMT

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దేశంలోనే అతి పొడవైన ఆరు ఫ్లైఓవర్‌ను కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఫ్లైఓవర్‌ను దేశమంతా చూపించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన కేంద్రం... ఫ్లైఓవర్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సెప్టెంబరు 4న వర్చువల్‌ పద్ధతిలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు.

దుర్గగుడి ఫ్లైఓవర్‌ను ఇంజినీరింగ్‌ అద్భుతంగా భావిస్తున్న కేంద్రం... దేశ ప్రజలకు పరిచయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్‌ బృందాన్ని విజయవాడకు పంపించింది. ఈ మేరకు ఫ్లైఓవర్‌ అందాలను చిత్రీకరించిన కేంద్ర ప్రభుత్వ బృందం... చిత్రీకరించింది. చిత్రీకరణలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు... ఫ్లైఓవర్‌ డాక్యుమెంటరీని జాతీయ మీడియాలో ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో నిర్మించిన ఫ్లైఓవర్‌ ప్రత్యేకతను చాటిచెప్పాలని భావిస్తోంది. ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించడం ఫ్లైఓవర్‌ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఢిల్లీ, ముంబయిలో ఉన్నాయి. వాటి తర్వాత విజయవాడలోనే ఈ తరహా ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఢిల్లీ, ముంబయి ఫ్లైఓవర్ల కంటే కూడా అడ్వాన్స్‌ టెక్నాలజీతో దుర్గగుడి ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లైఓవర్‌ కావటం ప్రత్యేకతగా నిలుస్తోంది. 

Tags:    

Similar News