earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకపంనలు

Update: 2024-12-22 05:00 GMT

ప్రకాశం జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న (శనివారం) కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిన్న ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరులో భూప్రకపంనలు సంభవించిన సంగతి తెలిసిందే.

24 గంటలు గడవకముందే...

కానీ ఇరవై నాలుగు గంటలు గడవకముందే మరోసారి భూప్రకంపనలు రావడం భయాందోళనలకు గురి చేస్తుంది. వరసగా రెండు రోజుల పాటు భూ ప్రకంపనలు ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇళ్లల్లో ఉన్న సామాన్లు కదలడం, కొన్ని గోడలకు క్రాక్ లు earthquake in andhrapradeshరావడంతో దీనిని భూకంపంగా గుర్తించారు. అయితే అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. 

Tags:    

Similar News