FARMERS: రైతన్నకు ఎంత కష్టం.. ఎంత నష్టం

రైతులను ముంచిన మొంథా తుఫాన్... వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట.. చేతికొచ్చిన పంట వరద నీటి పాలు... తెలుగు రాష్ట్రాల రైతుల ఆవేదన

Update: 2025-10-31 05:00 GMT

రై­తు­లు ఆరు­గా­లం కష్ట­ప­డి పం­డిం­చిన పంట చే­తి­కి వచ్చే సమ­యం­లో మొం­థా తు­ఫా­న్ రై­తు­ల­ను నిం­డా ముం­చిం­ది. వా­నా­కా­లం సీ­జ­న్‌­లో అధిక శాతం మంది రై­తు­లు మొ­క్క­జొ­న్న­పం­ట­ను వే­శా­రు. పంట చే­తి­కి వస్తు­న్న సమ­యం­లో తు­ఫా­న్ రా­వ­డం­తో రై­తు­లు మా­ర్కె­ట్లో ఆర­బో­శా­రు. రెం­డు రో­జు­లు­గా కు­రు­స్తు­న్న వర్షా­ని­కి మొ­క్క­జొ­న్న ధా­న్యం తడి­సి ము­ద్ద­యి­పో­యిం­ది. మొ­క్క­జొ­న్న ధా­న్యం కొ­ను­గో­లు కేం­ద్రా­లు ఏర్పా­టు చే­య­క­పో­వ­డం­తో దళా­రు­లు ఇష్టా­రా­జ్యం­గా కొ­ను­గో­లు చే­స్తుం­డ­డం­తో రై­తుల పరి­స్థి­తి అగ­మ్య గో­చ­రం­గా మా­రిం­ది.

లక్ష ఎకరాల్లో వరి పంట నష్టం

అం­బే­ద్క­ర్ కో­న­సీమ, పశ్చిమ గో­దా­వ­రి, తూ­ర్పు గో­దా­వ­రి జి­ల్లా­ల్లో సు­మా­రు లక్ష ఎక­రా­ల్లో వరి పంట దె­బ్బ­తి­నిం­ది. అన­ప­ర్తి, రా­మ­చం­ద్ర­పు­రం, ని­డ­ద­వో­లు ప్రాం­తా­ల్లో మరో రెం­డు వా­రా­ల్లో రై­తుల చే­తి­కి అం­దా­ల్సిన పంట మొ­త్తం నీట ము­ని­గి­పో­వ­డం­తో లబో­ది­బో­మం­టు­న్నా­రు. మొం­థా తు­ఫా­ను­తో ఉమ్మ­డి పశ్చిమ గో­దా­వ­రి జి­ల్లా వ్యా­ప్తం­గా వరి రై­తు­లు నష్ట­పో­యా­రు. ఉమ్మ­డి జి­ల్లా వ్యా­ప్తం­గా సు­మా­రు 50 వేల ఎక­రా­ల్లో పంట నష్టం జరి­గిం­ద­ని అధి­కా­రు­లు ప్రా­థ­మి­కం­గా అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఏలూ­రు జి­ల్లా­లో­ని పె­ద­పా­డు, ని­డ­మ­ర్రు, దెం­దు­లూ­రు మం­డ­లా­ల్లో వేల ఎక­రా­ల్లో వరి పంట నే­ల­కు ఒరి­గిం­ది. ఎక­రా­ని­కి 30 వేల వరకు పె­ట్టు­బ­డి పె­ట్టిన రై­తు­లు తీ­వ్రం­గా నష్ట­పో­యిన పరి­స్థి­తి కని­పి­స్తోం­ది.


పంట నష్టంపై ప్రాథమిక నివేదిక

అకాల వర్షా­ల­తో పం­ట­లు నష్ట­పో­యిన ప్రాం­తా­ల్లో వ్య­వ­సాయ శాఖ అధి­కా­రు­లు పర్య­టిం­చా­ల­ని, ప్రా­థ­మిక ని­వే­దిక తయా­రు­చే­సి డై­రె­క్ట­రే­ట్‌­కు పం­పిం­చా­ల­ని బు­ధ­వా­రం క్షే­త్ర­స్థా­యి­కి ఆదే­శా­లు వె­ళ్లా­యి. ఏఈ­వో­లు, ఏఈ­వో­ల­తో­పా­టు ఏడీ­ఏ­లు కూడా క్షే­త్ర­స్థా­యి­లో పం­ట­ల­ను పరి­శీ­లిం­చా­ల­ని, పంట నష్టం అం­చ­నా వే­యా­ల­ని సూ­చిం­చా­రు. వరద నీటి ప్ర­వా­హం తగ్గిన తర్వాత పంటల పరి­స్థి­తి ఏమి­టి? తే­లిన తర్వాత కో­లు­కుం­టా­యా? లే­క­పో­తే పూ­ర్తి­గా నష్ట­పో­యి­న­ట్లే­నా? పంట నష్టం ఎంత శాతం జరి­గిం­ది? అనే అం­శా­ల­పై ని­వే­దిక ఇవ్వా­ల­ని వ్య­వ­సాయ శాఖ ఉన్న­తా­ధి­కా­రు­లు ఆదే­శా­లు జారీ చే­శా­రు.

నీట మునిగిన పంటలు

భారీ వర్షా­ల­కు అన­కా­ప­ల్లి­లో­ని శారద నది ఉద్ధృ­తం­గా ప్ర­వ­హి­స్తుం­ది. అన­కా­ప­ల్లి మం­డ­లం వేం­క­పా­లెం వద్ద వె­దు­ర్ల­గె­డ్డ నుం­చి నీరు రహ­దా­రి­పై ప్ర­వ­హి­స్తోం­ది. ఈ మా­ర్గం­లో రా­క­పో­క­లు ని­లి­చి­పో­యా­యి. వర్షా­ల­కు అన­కా­ప­ల్లి జి­ల్లా­లో 1278 హె­క్టా­ర్ల­లో వరి పంట నీటి ము­ని­గి­న­ట్లు అధి­కా­రు­లు అం­చ­నా వే­శా­రు. వి­జ­య­న­గ­రం జి­ల్లా రా­జాం ని­యో­జ­వ­ర్గం­లో వర్షా­ల­కు గె­డ్డ­లు, వా­గు­లు పొం­గు పొ­ర్లు­తు­న్నా­యి. రె­ల్లి­గె­డ్డ ఉద్ధృ­తి­తో సి­రి­పు­రం - పొం­దూ­రు గ్రా­మాల మధ్య రా­క­పో­క­ల­కు అం­త­రా­యం ఏర్ప­డిం­ది. మం­డ­వ­కు­ర్తి -టీడీ వలస గ్రా­మాల మధ్య కూడా అధి­కా­రు­లు రా­క­పో­క­లు ని­లి­పి­వే­శా­రు. తు­పా­న్ ప్ర­భా­వం­తో రా­జాం ని­యో­జ­క­వ­ర్గం­లో­ని పలు గ్రా­మా­ల్లో వరి పంట నే­ల­కొ­రి­గిం­ది. పా­ర్వ­తీ­పు­రం మన్యం జి­ల్లా సా­లూ­రు మం­డ­లం­లో­ని ప్రా­థ­మిక ఆరో­గ్య కేం­ద్రం­లో­కి వర్ష­పు నీరు చే­రిం­ది.

Tags:    

Similar News