చించుకుందాం రా.. ఒంగోలులో ఫ్లెక్సీ వార్
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన, వైసీపీ మధ్య నెలకొన్న ఫ్లెక్సీ వార్;
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన, వైసీపీ మధ్య నెలకొన్న ఫ్లెక్సీ వార్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు,పవన్‌కళ్యాణ్‌కు వ్యతిరేకంగా బాలినేని అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అటు జగన్‌ను నరకాసురుడిగా పోలుస్తూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే అనుమతి లేదన్న సాకుతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. మరి కొన్ని ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చించేశాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీని నేతలను ఘటనా స్థలం నుంచి పంపించే ప్రయత్నం చేశారు.