Andhra Pradesh:పెళ్లి పందిట్లో వరుడి పై యాసిడ్ దాడి
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో ఘటన..;
తనను ప్రేమించి మరో అమ్మాయిని వివాహమాడుతున్నాడంటూ పెళ్లి పందిరిలో ఓ యువతి హల్‌చల్ చేసింది. తనతో పాటు కత్తి, యాసిడ్ తెచ్చుకుని పెండ్లి కొడుకుపై దాడికి దిగింది. అన్నమయ్య జిల్లాలోని నందలూరు మండలం అరవపల్లిలో ఓ పెళ్లి మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న నందలూరు పోలీసులు పెళ్లి కొడుకు సయ్యద్ బాషా, అతడి ప్రియురాలు జయను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాషా తనతో ప్రేమాయణం కొనసాగించి, ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని జయ తెలిపింది. బాషాకు స్వల్ప గాయాలయ్యాయి.
అంతేకాదు షాదీఖానాలో పెళ్లి కొడుకు సయ్యద్ భాషాపై కత్తి, యాసిడ్ తో దాడి చేసింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు ఈ ఘటన చూసి షాకయ్యారు. ఈ గొడవలో కొంతమంది మహిళలపై యాసిడ్ పడటంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకు సయ్యద్ భాషా, అతని స్నేహితురాలు జయను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అతడిపై పెళ్లి పందిరిలో యువతి దాడి చేయడంతో పెళ్లి రద్దు అయింది. పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. పెళ్లి కూతురు ఏపీకి చెందిన యువతి. ఆమెకు రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాతో పెద్దలు ఇవాళ వివాహం నిశ్చయించారు. సయ్యద్ బాషా ఇంతకుముందే తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా, పెళ్లి పందిరిలో జయ చేసిన రచ్చతో యాసిడ్ పడి ఒక మహిళలకు తీవ్రం గాయాలుకాగా, మరో మహిళలు స్వల్ప గాయాలయ్యాయి.