కడప జిల్లాలో ముంపుబాధితుల నిరసనలు పట్టించుకోని ప్రభుత్వం

కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామాన్ని పోలీసులు బలగాలు చుట్టుముట్టాయి. గత ఆరు రోజులుగా తాళ్ల పొద్దుటూరు..

Update: 2020-09-08 09:10 GMT

కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామాన్ని పోలీసులు బలగాలు చుట్టుముట్టాయి. గత ఆరు రోజులుగా తాళ్ల పొద్దుటూరు ముంపువాసులు నిరసనలు చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం కానీ.. అధికారులు కానీ స్పందించలేదు. మరోవైపు గ్రామాన్ని గండికోట ప్రాజెక్టు జలాలు చుట్టుముడుతున్నాయి. అటు పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే పునారావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఊరు ఖాళీ చేయడానికి సిద్ధమని ప్రజలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేయడంతో... గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 

Tags:    

Similar News