Nellore : గాంధీ విగ్రహం ముందు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు..
Nellore : ప్రభుత్వం తనకు వచ్చే పెన్షన్‌ను తీసేసిందని నెల్లూరులో ఓ దివ్యాంగుడు తనను తానే చెప్పుతో కొట్టుకున్నాడు.
Nellore : కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉన్న పెన్షన్ కట్ చేసిందనే ఆవేదనతో ఓ దివ్యాంగుడు చెప్పుతో కొట్టుకున్న సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. వెంకటగిరి నియోజకవర్గంలోని వెలంపాలెంలో గాంధీ విగ్రహం ముందు దివ్యాంగుడు వెంకటేశ్వర్లు తన సోదరుడు నరసింహులుతో కలిసి నిరసన తెలిపాడు.. వున్న పెన్షన్ తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానంటూ చెప్పుతో కొట్టుకున్నాడు.