ఏపీ ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో గాలిలో తేమశాతం పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతంగా చెమటలు, ఎక్కువ దాహం వేస్తుందంటున్నారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మన్యం, అల్లూరి, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.
మరోవైపు తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, జనగామ, భువనగిరి, RR, HYD, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.