AP : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో కుండపోత సూచన

Update: 2024-08-17 08:30 GMT

వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ప్రాం­తాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారేఅవకాశం వుందని ఆంచనా వేస్తున్నారు. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. బెంగాల్, జార్ఖండ్‌ పరి­సర ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయి.

ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, కృష్ణా, ఏలూరు, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచించింది.

శనివారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. వాయుగుండం తేమగాలుల్ని తీసుకుపోవడం వల్ల మరో మూడు రోజుల పాటు ఉక్కపోత కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News