చిత్తూరు జిల్లాలో అర్థాంతరంగా ఆగిపోయిన రేషన్ పంపిణీ

ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ చిత్తూరు జిల్లాలో అర్ధాంతరంగా ఆగిపోయింది.;

Update: 2021-02-03 15:00 GMT

ఏపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ చిత్తూరు జిల్లాలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంటింటికి వెళ్లి సరుకులను ఇచ్చే ట్రక్ డ్రైవర్లు వాహనాలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. సరుకులను రవాణా చేయలేమంటూ చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవడంలేదని.. కనీసం డీజిల్‌కి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాహనాలను ఎలా నడపాలంటూ ప్రశ్నిస్తున్నారు ట్రక్ డ్రైవర్లు. తిరుపతి ఆర్డీఓను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. హమాలీలు రాకపోవడంతో నిత్యావసర వస్తువలు పంపిణీ ఉన్నట్టుండి ఆగిపోయింది. 

Similar News