KAVITHA: కవితకు 'క్లీన్ చిట్'పై భిన్నస్వరాలు

Update: 2026-02-28 05:00 GMT

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఊరట లభించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. సీబీఐ కేసు వీగిపోవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందిస్తూ.. కోర్టు కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే చెప్పిందని, ఇది 'క్లీన్ చిట్' కాదని స్పష్టం చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎన్నటికీ పొత్తు ఉండదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దీనిని బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. అవసరాలకు అనుగుణంగా బీజేపీ తన మిత్రులను, శత్రువులను మార్చుకుంటుందని విమర్శించారు. కవితకు ఊరట వెనుక రాజకీయ ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ విచారణలో కోర్టు తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కవితకు ఊరట లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా, ప్రత్యర్థి పార్టీలు విమర్శల పదును పెంచాయి.రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ తీర్పు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందనే చర్చ మొదలైంది.

45 రోజులపాటు సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీ చార్జిషీట్లలో అనేక లోపాలు ఉన్నాయని, సాక్షుల వాంగ్మూలాలు ఆరోపణలకు మద్దతు ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది. ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేకుండానే నిందితులను ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను ఈ కేసులో లాగడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు సంస్థలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేసు నిస్పక్షపాతంగా విచారణ జరగాలంటే దర్యాప్తు కూడా అదే స్థాయిలో నిష్పాక్షికంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఆరోపణలను నిరూపించేందుకు సరైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని పేర్కొంటూ మొత్తం కేసును కొట్టివేసింది. ఈ కేసులో 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీ­ర్పు రా­జ­కీయ వర్గా­ల్లో వి­స్తృత చర్చ­కు దారి తీ­సిం­ది. ఒక­వై­పు ఆప్ పా­ర్టీ దీ­న్ని తమపై జరి­గిన రా­జ­కీయ ప్ర­తీ­కా­రా­ని­కి ము­గిం­పు అని పే­ర్కొం­టుం­డ­గా, మరో­వై­పు కేం­ద్ర ప్ర­భు­త్వం­పై ప్ర­తి­ప­క్షా­లు తీ­వ్ర వి­మ­ర్శ­లు గు­ప్పి­స్తు­న్నా­యి. దర్యా­ప్తు సం­స్థ­ల­ను రా­జ­కీయ ప్ర­యో­జ­నాల కోసం ఉప­యో­గి­స్తు­న్నా­ర­నే ఆరో­ప­ణ­లు మళ్లీ ముం­దు­కు వచ్చా­యి. అదే సమ­యం­లో, ఈ కే­సు­లో అరె­స్టు­లు, జైలు జీ­వి­తం కా­ర­ణం­గా నిం­ది­తు­ల­కు జరి­గిన నష్టం పూ­డ్చ­లే­ని­ద­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. భవి­ష్య­త్తు­లో పరు­వు నష్టం దా­వా­లు వే­య­బ­డే అవ­కా­శా­లు ఉన్నా­య­ని చర్చ జరు­గు­తోం­ది.

కల్వకుంట్ల కవితకు సీబీఐ బిగ్ షాక్

ఢి­ల్లీ లి­క్క­ర్ స్కా­మ్‌­లో ఎమ్మె­ల్సీ కవి­త­కు ఊరట లభిం­చిన కొ­ద్ది గం­ట­ల్లో­నే సీ­బీఐ షాక్ ఇచ్చిం­ది. నిం­ది­తు­లం­ద­రి­నీ వి­డు­దల చే­స్తూ ట్ర­య­ల్ కో­ర్టు ఇచ్చిన తీ­ర్పు­ను సవా­లు చే­స్తూ సీ­బీఐ ఢి­ల్లీ హై­కో­ర్టు­లో పి­టి­ష­న్ దా­ఖ­లు చే­సిం­ది. మద్యం వి­ధా­నం రూ­ప­క­ల్ప­న­లో అక్ర­మా­లు జరి­గా­య­ని, కవిత పా­త్ర­పై కీలక ఆధా­రా­లు ఉన్నా­య­ని సీ­బీఐ వా­ది­స్తోం­ది. ఈ అప్పీ­ల్‌­తో కవి­త­కు మళ్లీ చి­క్కు­లు మొ­ద­ల­య్యే అవ­కా­శం ఉంది.

Tags:    

Similar News