వైసీపీలో కొత్త రగడ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో కుమ్ములాట జరుగుతోంది. సొంత పార్టీ నేతల మధ్య ఫైటింగ్ జరుగుతోంది. జగన్ చెప్పినా సరే ఎవరూ వినకుండా ఎవరికి వారే రెచ్చిపోతూ బహిరంగంగానే ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మీ వల్లే నేను ఓడిపోయా అంటూ మాజీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలోనూ ఇదే వైనం కనిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో సతీష్ వర్సెస్ అవినాష్ అన్నట్టు రాజకీయం మారిపోయింది. పార్టీ రెండు వర్గాలుగా ఇక్కడ చీలిపోయింది. ఎవరికి వారు తమ పెత్తనం చూపించుకుంటున్నారు. జగన్ ఎలాగూ బెంగుళూరులోనే ఉండిపోవడంతో లోకల్ కేడర్, నాయకులతో ఆయనకు కనెక్షన్ తెగిపోయింది. దీంతో ఎవరికి వారే పార్టీపై పెత్తనాలు చూపించుకుంటున్నారు. అవినాష్ తనదే నడవాలన్నట్టు ఆదేశాలు ఇస్తున్నారు. దీనికి సతీష్ ఒప్పుకోవట్లేదు. దీంతో పార్టీ కేడర్ ఎవరి మాట వినాలో అర్థం కాక సైలెంట్ గా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంట.
అటు జమ్మలమడుగులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సుధీర్ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి అన్నట్టు అక్కడ రగడ జరుగుతోంది. జగన్ వద్ద తనకే పట్టు ఉందని ఎవరికి వారే చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారు. ఒకరికి పోటీగా ఇంకొకరు కార్యక్రమాలు పెడుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పార్టీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రజల ముందే పార్టీ నేతలు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు. ఇంకోవైపు బద్వేల్ నియోజకవర్గంలోనూ గోవిందరెడ్డితో విశ్వనాథ రెడ్డి ఢీ అంటే ఢీ అంటూ రెచ్చిపోతున్నారు.
వీరిద్దరూ ఒకరిపై ఒకరు రెచ్చిపోతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. పార్టీకి మించి తమ సొంత ఇమేజ్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ చాలా వీక్ అయిపోయింది. పార్టీ నుంచి వస్తున్న ఆదేశాలను కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరికి వారే అన్న చందంగా మారిపోయింది. దీంతో జగన్ కు కొత్త తలనొప్పి మొదలైంది. ఎవరిని వారించాలో, ఎవరిని దూరం చేసుకోవాలో అర్థం కాక జగన్ కూడా సైలెంట్ గా ఉంటున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఇలా అంతర్గత కుమ్ములాటలు రావడంతో పార్టీ పట్టు పూర్తిగా సడలుతోంది.