ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏ చిన్న అవకతవకకు కూడా అవకాశం లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,537 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 10,57,312 మంది విద్యార్థులు ఈ వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొననున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి కేంద్రంలో సదుపాయాలు, సిబ్బంది, పర్యవేక్షణ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.