ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇండియాలోని అన్ని రాష్ట్రాలు తలలు పట్టుకున్నాయి. అయ్యో ఈ గూగుల్ డేటా సెంటర్ తమ రాష్ట్రానికి ఎందుకు రాలేకపోయింది అని ఇతర రాష్ట్రాలు బాధపడ్డాయి. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా గూగుల్ డేటా సెంటర్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కృషిని స్వయంగా అభినందించారు. అయితే అప్పటివరకు వైసీపీ బ్యాచ్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. గూగుల్ డేటా సెంటర్ అంటే గోడౌన్ అని అక్కడ ఒక వాచ్మెన్ తప్ప ఇంక ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండదని.. దానివల్ల కరెంటు, నీరు భారీగా వృధా అవుతుందని.. పొల్యూషన్ మొత్తం పాడైపోతుందని.. రకరకాలుగా తప్పుడు ప్రచారం చేసింది వైసీపీ. ప్రపంచమంతా మెచ్చుకుంటుంటే వైసీపీ మాత్రం ఇలా తప్పుడు ప్రచారం చేయడంపై ఏపీ ప్రజలు కూడా ఛీ కొట్టారు.
దెబ్బకు జగన్ రంగంలోకి దిగి కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం చాలా గొప్ప విషయమని అందరికీ షాక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అప్పటివరకు దీనిపై రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలను వెర్రి పప్పలను చేశాడు. ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని వైసిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ జగన్ సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్ ద్వారా క్రెడిట్ కొట్టేసే పనిలోపడ్డాడు. ఇప్పుడు ఏపీకి వస్తోంది అదానీ డేటా సెంటర్ అని.. తాను సీఎంగా ఉన్నప్పుడే 2019లో అదాని డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు దానికి తోడుగా గూగుల్ వస్తుందని ఆ క్రెడిట్ అంతా తనదే అని ఓ కథ అల్లేశారు. వాస్తవానికి జగన్ హయాంలో శంకుస్థాపన జరిగింది అదానీ డేటా సెంటర్ కోసం మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ కోసం కాదు.
స్వయంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా తర్వాత విశాఖలో తాము 15 బిలియన్ డాలర్స్ తో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు. అదానీ డేటా సెంటర్ గురించి గానీ.. అదానీ గురించి గానీ ఎక్కడా చెప్పలేదు. నేరుగా తామే పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపాడు. మరి సుందర్ పిచాయ్ చెప్పిన తర్వాత కూడా జగన్ ఇంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ క్రెడిట్ కొట్టేయడానికి ప్లేటు ఫిరాయించడం నిజంగా ఆయన విజ్ఞతకు నిదర్శనం. ముందు గూగుల్ డేటా సెంటర్ వల్ల లాభమే లేదని చెప్పిన వైసీపీ బ్యాచ్.. ప్రపంచమంతా మెచ్చుకునేసరికి నాలుక కరుచుకొని.. క్రెడిట్ కొట్టేయడానికి కొత్త స్క్రిప్ట్ రెడీ చేసుకుంది. పెట్టుబడులు తీసుకురావడం తమకు చేతకాదు కానీ క్రెడిట్ కొట్టేయడం మాత్రం తమకు చేతన అవుతుందని ఈ కొత్త డ్రామా ద్వారా నిరూపించుకుంది వైసిపి బ్యాచ్. కానీ ఏపీ జనాలు తాము ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకున్న జగన్.. ఇంత ఈజీగా రకరకాల అబద్ధాలు ఆడేస్తున్నారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం జగన్ మాటలను గాని వైసీపీ బ్యాచ్ డ్రామాలను గాని అస్సలు నమ్మట్లేదు.