మాజీ సీఎం జగన్ ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఎలాగూ తన హయాంలో ఏమీ డెవలప్ చేయలేదు కాబట్టి ప్రజల్లో క్రెడిట్ కావాలని పాకులాడుతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏం కట్టినా సరే దాన్ని తన ఖాతాలో వేసుకోడానికి పాకులాడుతున్నారు. మొన్న భోగాపురం ఎయిర్ పోర్టుకు మొదటి ఫ్లైట్ రావడంతో వైసీపీ బ్యాచ్ కన్ను దాని మీద పడింది. వెంటనే రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. ఎయిర్ పోర్టు కట్టింది జగనే అంటూ కట్టుకథలు మొదలుపెట్టారు. 2016-2019 మధ్యలో భోగాపురం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ చేస్తుంటే కేసులు వేసింది ఇదే జగన్. రైతుల భూములు పోతున్నాయంటూ.. ఎర్రబస్సు రాని ఊరుకు ఎయిర్ పోర్టు ఎందుకు.. ఇది బుద్ధి లేని పని అంటూ చాలా రకాల సభలు పెట్టి అడ్డుకున్నది ఇదే జగన్. ఆ గ్యాప్ లోనే ఎన్నికల్లో జగన్ గెలిచాడు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. చివరకు 2023లో మళ్లీ జగన్ శంకుస్థాపన చేశాడు.
కానీ ఎయిర్ పోర్టుకు ఒక్క ఇటుక కూడా కట్టలేదు. గాలికొదిలేశాడు. ఇప్పుడు కూటమి వచ్చాక దాన్ని పూర్తి చేసింది. కేంద్ర విమానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండటంతో పనులు వేగంగా జరిగాయి. ఇప్పుడు ఓపెనింగ్ కు రెడీ అవుతోంది. దీంతో నాలుక కరుచుకున్న వైసీపీ క్రెడిట్ కొట్టేసే పనిలో పడింది. కేవలం దీంట్లోనే కాదు.. అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టు విషయంలోనూ జగన్ ది ఇదే పంతా. ముందు వద్దని కోర్టుల్లో కేసులు వేయిస్తారు. తర్వాత కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసి చూపిస్తే ఆ క్రెడిట్ నాదే అంటారు.
ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అబ్బే అది నా వల్ల కాదు చంద్రబాబు చేయడం వల్లే వచ్చిందంటారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కనీసం పర్మిషన్ తీసుకోకుండా జగన్ అరాచకం చేయడం వల్లే అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపిందంటూ రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు జగన్ బ్యాచ్. వాళ్లు మొదటి నుంచి ఇంతే. అభివృద్ధి చేయడం వాళ్లకు చేతకాదు. ఎవరైనా కడితే క్రెడిట్ మాత్రం కొట్టేయడానికి రెడీగా ఉంటారు కాబోలు.