PAWAN: చిరంజీవి జోలికి వస్తే సహించను
వైసీపీ నేతలకు పవన్‌కల్యాణ్ హెచ్చరిక.... అక్వా రైతులను జగన్ ముంచేశారన్న జనసేనాని;
ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచారని కూటమి అధికారంలోకి రాగేనే లాభసాటిగా సాగేలా చూస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి అసాధ్యమన్నారు. వైకాపా నేతలకు డబ్బులు ఎక్కువైపోయి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చిరంజీవి.. కూటమి నేతలకు మద్దుతు ప్రకటించగానే సజ్జల రామకృష్టారెడ్డి..... ఎంతమంది కలిసినా లెక్కలేదంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. నదులు అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్ లో వలసలు, పస్తులు లేకుండా చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్మమనిపవన్ కల్యాణ్ స్ప ష్టంచేశారు. కేంద్రం మద్దతులేకుండా ఏపీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం కూటమి నిలబడ్డదని గుర్తుచేశారు.
ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పని చేస్తున్నాయని పవన్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక తక్కువ వ్యవధిలో పోలవరం పూర్తికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ కల్పించడమే కాక చేతివృత్తులు, కులవృత్తులు పరిరక్షిస్తామని..పవన్ హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో తగ్గించిన బీసీ రిజర్వేషన్లను.. తిరిగి 34శాతానికి పునరుద్ధరిస్తామన్నారు. ఆక్వా రంగాన్ని పరిశ్రమను జగన్ సమూలంగా ముంచారని దుయ్యబట్టారు. మత్స్యకారుల భవిష్యత్తుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. నరసాపురంలో వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమని గతంలో జగన్ చెప్పారని గుర్తు చేసిన పవన్ ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. సింహం సింగిల్‌గా వస్తుందంటున్నారు.. వైసీపీ సింహం కాదు గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని మండిపడ్డారు. ‘‘గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. నిలబడ్డానంటే మీ అభిమానమే కారణం. దశాబ్దంపాటు ఒడిదొడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగింది. జగన్‌లా నాపై 32 కేసులు లేవు.. రాష్ట్రాభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిశాయి. వలసలు, పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీయే కూటమి లక్ష్యం. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేం నిలబడ్డాం. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకి నీరు. అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. చేతివృత్తులు, కుల వృత్తులను రక్షిస్తాం. తక్కువ వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పవన్ అన్నారు.