చలో మదనపల్లి విఫలంకు పోలీసుల యత్నం

Update: 2020-10-02 05:01 GMT

దళిత సంఘాల చలో మదనపల్లె పిలుపుతో చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ వందల మందిని అరెస్టు చేశారు. నేతలను గృహ నిర్బంధించారు. మదనపల్లె అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకూ.. దళిత సంఘాలు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసుల ఆంక్షలపై వారంతా మండిపడుతున్నారు. అటు, మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. మరోవైపు ఈ అరెస్టులు, నిర్బంధాల్ని నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు.

అడ్వొకేట్ శ్రవణ్ సహా మిగతా వారిని వదిలిపెట్టాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఛలో మదనపల్లెకు ఎందుకు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అటు, తమ సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే తప్పేంటని న్యాయవాది శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. తిరుపతిలోని హోటల్ గదిలో తనను బంధించడం పట్ల నిరసన తెలిపారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్‌ను.. పోలీసులు అడ్డుకుని ఉంటే ప్రజాసమస్యలు తెలిసేవా అంటూ ప్రశ్నించారు. దళితులై దాడులు జరుగుతున్నా పట్టించుకోరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Similar News