AP: ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు

Update: 2024-10-28 04:00 GMT

తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన పలువురు ఐఏఎస్‎లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషనర్‎గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలిని టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం నియమించింది. వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నలుగురు ఐఏఎస్‌లు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను సీఎస్‌‌కు సమర్పించారు.

డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుండి పలువురు ఐఏఎస్‎లు ఆంధ్రప్రదేశ్‎కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, ప్రశాంతి, వాణీప్రసాద్ 2024, అక్టోబర్ 16వ తేదీన ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఇందులో ఐఏఎస్ ప్రశాంతికి ఈ నెల 20వ తేదీనే ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రశాంతికి అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. తాజాగా ఇవాళ మరికొందరికి పదవులు ఇచ్చింది. రోనాల్డ్ రోస్‎కు మాత్రం ఏపీ సర్కార్ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

Tags:    

Similar News