West Godavari: కోళ్ల పందేలకు రెడీ అవుతున్న గోదారోళ్లు..
West Godavari: తూర్పుగోదావరి జిల్లా గోకవరం కోళ్ల సంత కిటకిటలాడుతుంది.
West Godavari: తూర్పుగోదావరి జిల్లా గోకవరం కోళ్ల సంత కిటకిటలాడుతుంది. వివిధ రకాల జాతుల పందెం కోళ్లు కొనేందుకు పందెం రాయుళ్లు తరలివస్తున్నారు. నర్సీపట్నం, భీమవరం, పాడేరు, బొబ్బిలి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను తీసుకొచ్చారు.
అటు.. కోళ్లను చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. వివిధ రకాల జాతుల కోళ్లు ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో కోడి ధర 7వేల నుంచి 20వేల వరకు పలుకుతుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తారు.