Lokesh : వచ్చేవారం పెద్ద కుంభకోణాన్ని బయటపెడతా : నారా లోకేశ్

Lokesh : సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం బయటపెట్టబోతున్నానని నారా లోకేశ్ అన్నారు;

Update: 2022-08-17 03:15 GMT

Lokesh : సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం బయటపెట్టబోతున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తన సొంత ఖర్చులతో మంగళగిరిలో ఆరోగ్య సంజీవని కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.10వ తరగతి పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డివి అని మండిపడ్డారు. జగన్ రెడ్డికి టైమప్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వచ్చేసిందన్నారు.రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే నేను చర్చకు సిద్ధమని.ఈడీ,ఐటీ, సీబీఐకి భయపడి సీఎం జగన్‌ ఢిల్లీలో తలవంచారని అన్నారు లోకేష్‌

అందరికీ ఆరోగ్యమస్తు - ఇంటికి శుభమస్తు నినాదంతో సొంత ఖర్చుతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య కేంద్రాన్ని నారా లోకేశ్‌ ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్య సంజీవని పేరుతో నియోజకవర్గంలోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, చికిత్స పరికరాలను లోకేశ్‌ సమకూర్చారు. ఇక్కడ దాదాపు 200కుపైగా రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.

మరోవైపు సీఎం జగన్‌ దళిత ద్రోహీగా మారారని, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లిస్తూ వారికి తీరని అన్యాయం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్‌ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ మంగళగిరిలో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు విదేశాల్లో చదివి ఉన్నతంగా స్థిరపడాలన్న లక్ష్యంగా చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ పేరిట విదేశీ విద్య స్కీమ్‌ తెచ్చారన్నారు. అంబేద్కర్‌ పేరు తీసేసి జగనన్న వీదేశీ విద్య అని మార్కుకున్న సైకో జగన్‌ అని ఫైర్‌ అయ్యారు.

ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువని. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వ కృషేనన్న లోకేష్‌.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు. దాదాపు 500 హామీల్లో మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించాలా?. అంటూ ప్రశ్నించారు నారా లోకేశ్.

Tags:    

Similar News