LOKESH: ‘మీకు హ్యాట్సాఫ్‌ సార్’.. టీచర్‌పై లోకేష్ ప్రశంసలు

Update: 2025-07-27 04:30 GMT

గు­రు­వు­లు తలు­చు­కుం­టే వి­ద్యా­ర్థుల జీ­వి­తా­ల్లో వె­లు­గు­లు నిం­ప­డ­మే కా­కుం­డా, సమా­జా­న్ని సైతం కది­లిం­చ­వ­చ్చ­ని ని­రూ­పిం­చిన ఘటన ఒకటి ఏపీ­లో చో­టు­చే­సు­కుం­ది. రా­ష్ట్రం­లో­ని ఎన్టీ­ఆ­ర్ జి­ల్లా వి­స్స­న్న­పేట మం­డ­లం నర­సా­పు­రం జడ్పీ­హె­చ్‌­ఎ­స్‌­కు చెం­దిన ఇం­గ్లీ­ష్ టీ­చ­ర్ శ్రీ­ధ­ర్ బొ­ల్లే­ప­ల్లి ఓ ని­రు­పేద వి­ద్యా­ర్థి­కీ బ్రె­యి­న్ సర్జ­రీ చే­యిం­చా­రు. ఫే­స్‌­బు­క్‌­లో ఉపా­ద్యా­యు­డు శ్రీ­ధ­ర్ పె­ట్టిన పో­స్ట్ చూసి దా­త­లు రూ.6 లక్ష­లు అం­దిం­చా­రు. ఈ వి­ష­యం ఏపీ వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­ష్ దృ­ష్టి­కి వె­ళ్ల­డం­తో ఆయన ట్వి­ట్ట­ర్ వే­ది­క­గా ప్ర­శం­సల వర్షం కు­రి­పిం­చా­రు. అం­కి­త­‌­భా­వం­తో బో­ధ­‌­న‌, ని­స్వా­ర్థ సే­వా­కా­ర్య­‌­క్ర­‌­మాల ద్వా­రా వి­ద్యా­ర్థు­ల­‌­కు మా­ర్గ­‌­ద­‌­ర్శి­గా ని­లు­స్తో­న్న ఎన్టీ­ఆ­ర్ జి­ల్లా వి­స్స­న్న­పేట మం­డ­లం నర­సా­పు­రం‌ జడ్పీ హై­స్కూ­ల్ ఇం­గ్లీ­ష్ టీ­చ­ర్ శ్రీ­ధ­ర్ బొ­ల్లే­ప­ల్లి­కి మం­త్రి నారా లో­కే­ష్ అభి­నం­ద­‌­న­‌­లు తె­లి­పా­రు. ప్ర­‌­మా­దా­ని­కి గు­రైన ఓ వి­ద్యా­ర్థి బ్రె­యి­న్ స‌­ర్జ­‌­రీ కోసం రూ.6 ల‌­క్ష­‌­లు వి­రా­ళా­లు పో­గు­చే­సి ప్రా­ణా­లు ని­లి­పిన ఆయ­న­కు హ్యా­ట్సా­ఫ్‌ అని మం­త్రి లో­కే­ష్ పే­ర్కొ­న్నా­రు.

Tags:    

Similar News