LOKESH: ఈ పోటీ తట్టుకోలేకపోతున్నా: లోకేశ్

ఆసక్తికర పోస్టు చేసిన నారా లోకేశ్

Update: 2025-12-18 14:15 GMT

మంత్రి నారా లోకేశ్ తన కుటుంబసభ్యులకు వరుసగా అవార్డులు రావటంపై ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'నాన్న 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. నా భార్య దేశంలోనే 'అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తల్లో' ఒకరిగా నిలిచారు. ఎన్నికల్లో పోటీ చేయటం కంటే ఈ కుటుంబంలోని వ్యక్తులతో పోటీ చేయటం కష్టంగా ఉందంటూ' సరదాగా వ్యాఖ్య చేశారు.

తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్నాయి. మంచు కూడా కురుస్తోంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని గురుకుల, కేజీబీవీ విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలికి తట్టుకోలేకపోతున్నారు. పైగా హాస్టల్‌లో సరైన వసతులు లేవు. దీంతో విద్యార్థులు అవస్థలు మరింతమయ్యాయి. ఈ మేరకు విద్యార్థులు తమ సమస్యలను బయటకు చెప్పుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్‌కు తెలిసింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. గురుకు విద్యార్థులు అవస్థలు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. పాడేరు ఏజెన్సీలో చదువుతున్న గురుకుల, కేజీబీవీ విద్యార్థులు ఈ శీతాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యానికే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. చిన్నారులకు తగిన వసతులు కల్పించి వెంటనే సమస్యను పరిష్కరించాలని అల్లూరి జిల్లా కలెక్టర్‌ను మంత్రి లోకేశ్ ఆదేశించారు.

Tags:    

Similar News