LOKESH: "చిరు వ్యాపారి వలీని త్వరలో కలుస్తా"

Update: 2026-02-15 11:30 GMT

సా­మా­జిక ఐక్య­త­కు భంగం కలి­గిం­చే చర్య­ల­ను తాను సమ­ర్థిం­చ­న­ని స్ప­ష్టం చే­స్తూ, కర్నూ­లు­కు చెం­దిన చి­న్న వ్యా­పా­రి వలీ­కి అం­డ­గా ని­లు­స్తా­న­ని ఏపీ మం­త్రి నారా లో­కే­శ్ తె­లి­పా­రు. ఈ వి­ష­యా­న్ని ఆయన ‘ఎక్స్’ వే­ది­క­గా పం­చు­కు­న్నా­రు. వలీ తయా­రు చే­సిన కోవా బన్ రుచి చూ­డా­ల­నే ఆస­క్తి వ్య­క్తం చే­స్తూ­నే, ఆయ­న­పై కొ­న్ని వర్గా­లు చే­సిన ఆరో­ప­ణ­లు తనను కల­చి­వే­శా­య­ని పే­ర్కొ­న్నా­రు. చిరు వ్యా­పా­రి­గా జీ­వ­నో­పా­ధి సా­గి­స్తు­న్న వలీ­పై అన­వ­సర వి­మ­ర్శ­లు చే­య­డం సమా­జా­ని­కి మేలు చే­య­ద­ని లో­కే­శ్ అభి­ప్రా­య­ప­డ్డా­రు. ఐక్య­త­ను దె­బ్బ­తీ­సే ప్ర­వ­ర్త­న­కు మన సమా­జం­లో స్థా­నం లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. త్వ­ర­లో­నే వలీ­ని స్వ­యం­గా కలి­సి, అత­ని­కి మద్ద­తు తె­లి­య­జే­స్తా­న­ని వె­ల్ల­డిం­చా­రు. సా­మా­జిక సమ­ర­స­త­ను కా­పా­డ­టం ప్ర­తి ఒక్క­రి బా­ధ్యత అని, చి­న్న వ్యా­పా­రుల మనో­భా­వా­ల­ను దె­బ్బ­తీ­య­కుం­డా ప్రో­త్స­హిం­చా­ల్సిన అవ­స­రం ఉం­దన్నారు.

Tags:    

Similar News