Lokesh : అది ఒరిజినల్ కాకపోవచ్చంటే ఒరిజినల్ ఉందనేగా : లోకేష్
Lokesh : ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఒరిజినల్ కాదంటూ ఎస్పీ ప్రకటించడంపైనా లోకేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.;
Lokesh ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ ఒరిజినల్ కాదంటూ ఎస్పీ ప్రకటించడంపైనా లోకేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.. ఒరిజనల్ కాదని ఎస్పీ ఏ ఆధారాలతో చెప్తారని ప్రశ్నించారు.. ఫోరెన్సిక్ ల్యాబ్ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.. ఇది ఒరిజినల్ కాకపోవచ్చు అంటున్నారంటే ఒరిజినల్ కచ్చితంగా ఉండి ఉంటుంది కదా అంటూ ఎస్పీని స్ట్రయిట్‌గా కొశ్చన్ చేశారు.
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు.. మూడేళ్లలో కుప్పానికి చేసిందేంటని నిలదీశారు.. ఈ ముఖ్యమంత్రి పర్యటనలతో పరదాలకు డిమాండ్ పెరిగిపోయిందంటూ సెటైర్లు వేశారు.. 2024లో ఎవరికెన్ని సీట్లు వస్తాయో ప్రజలే నిర్ణయిస్తారని లోకేష్ అన్నారు.