LOKESH: భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ

నేడు ప్రారంభించనున్న నారా లోకేశ్... నైపుణ్యాల కొరత తీర్చ‌డ‌మే లక్ష్యం... 160 ఎకరాల్లో ఎడ్యుసిటీ నిర్మాణం

Update: 2025-12-16 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో కూ­ట­మి ప్ర­భు­త్వం కీలక ప్రా­జె­క్టు­కు శ్రీ­కా­రం చు­ట్టిం­ది. దే­శం­లో­నే తొలి ఏవి­యే­ష­న్, ఏరో­స్పే­స్, డి­ఫె­న్స్ (AAD) ఎడ్యు­కే­ష­న్ సి­టీ­ని వి­జ­య­న­గ­రం జి­ల్లా భో­గా­పు­రం­లో ఏర్పా­టు చే­య­నుం­ది. 'జీ­ఎం­ఆ­ర్ మా­న్సా­స్ ఎడ్యు­సి­టీ' పే­రు­తో రా­ను­న్న ఈ ప్రా­జె­క్టు­ను రా­ష్ట్ర ఐటీ, వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్‌ నేడు వి­శా­ఖ­ప­ట్నం­లో­ని రా­డి­స­న్ బ్లూ రి­సా­ర్ట్‌­లో లాం­ఛ­నం­గా ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. దే­శం­లో వి­మా­న­యా­నం, ఏరో­స్పే­స్, రక్షణ రం­గా­లు శర­వే­గం­గా అభి­వృ­ద్ధి చెం­దు­తు­న్నా­యి. ఈ రం­గాల మా­ర్కె­ట్ వి­లువ 2034 నా­టి­కి 57 బి­లి­య­న్ డా­ల­ర్ల­కు చే­రు­తుం­ద­ని అం­చ­నా. అయి­తే, ఈ వే­గా­ని­కి తగ్గ­ట్టు­గా నై­పు­ణ్యం కలి­గిన మానవ వన­రు­లు అం­దు­బా­టు­లో లేవు. దేశం ప్ర­స్తు­తం పై­ల­ట్లు (12-15%), ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ మె­యిం­టె­నె­న్స్ ఇం­జ­నీ­ర్లు, భద్ర­తా ని­పు­ణుల కొ­ర­త­ను తీ­వ్రం­గా ఎదు­ర్కొం­టోం­ది. ఏటా కే­వ­లం 8 వేల మంది ఏరో­స్పే­స్ ఇం­జ­నీ­ర్లు మా­త్ర­మే పట్ట­భ­ద్రు­ల­వు­తు­న్నా­రు. ఇది మొ­త్తం ఇం­జ­నీ­రిం­గ్ గ్రా­డ్యు­యే­ట్ల­లో 0.5 శా­త­మే కా­వ­డం గమ­నా­ర్హం. ఈ నై­పు­ణ్యాల కొ­ర­త­ను అధి­గ­మిం­చే లక్ష్యం­తో భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం సమీ­పం­లో 160 ఎక­రాల వి­స్తీ­ర్ణం­లో ఈ ఎడ్యు­సి­టీ­ని ని­ర్మిం­చ­ను­న్నా­రు. దీం­తో వి­మా­న­యాన నై­పు­ణ్యా­లు మె­రు­గు­ప­డ­ను­న్నా­యి.

ఇది ఏవి­యే­ష­న్, ఏరో­స్పే­స్, డి­ఫె­న్స్ రం­గా­ల­కు అం­కి­త­మైన దే­శం­లో­ని మొ­ట్ట­మొ­ద­టి సమీ­కృత వి­ద్యా, ఆవి­ష్క­ర­ణల కేం­ద్రం­గా (ఇం­టి­గ్రే­టె­డ్ ఎడ్యు­కే­ష­న్ అండ్ ఇన్నో­వే­ష­న్ హబ్) ని­ల­వ­నుం­ది. ఇం­దు­లో ప్ర­పంచ ప్ర­ఖ్యాత యూ­ని­వ­ర్సి­టీల బ్రాం­చ్ క్యాం­ప­స్‌­లు, పరి­శో­ధన కేం­ద్రా­లు, స్టా­ర్ట­ప్‌ల కోసం ఇం­క్యు­బే­ష­న్ సదు­పా­యా­లు ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. మే­కి­న్ ఇం­డి­యా, జా­తీయ వి­ద్యా వి­ధా­నం (NEP-2020) వంటి లక్ష్యా­ల­కు అను­గు­ణం­గా ఈ ప్రా­జె­క్టు­ను తీ­ర్చి­ది­ద్ద­ను­న్నా­రు. దీని ద్వా­రా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­తో పాటు యా­వ­త్ భా­ర­త­దే­శా­న్ని ఏవి­యే­ష­న్, ఏరో­స్పే­స్ వి­ద్య, ఆవి­ష్క­ర­ణ­ల­లో ప్ర­పం­చ­స్థా­యి లీ­డ­ర్ గా ని­ల­బె­ట్ట­డ­మే లక్ష్యం­గా ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ది.

ఈ ఏవి­యే­ష­న్ ఎడ్యు­సి­టీ ఏర్పా­టు­తో వి­శాఖ ప్రాం­తం వి­మా­న­యా­నం, ఏరో­స్పే­స్, రక్షణ రం­గా­ల­కు సం­బం­ధిం­చిన వి­ద్య, శి­క్ష­ణ­ల­కు జా­తీయ హబ్‌­గా మా­ర­నుం­ది. ఇం­దు­కో­సం ప్ర­త్యేక నై­పు­ణ్యం కలి­గిన అం­త­ర్జా­తీయ వి­శ్వ­వి­ద్యా­ల­యా­ల­ను సైతం రా­ష్ట్రా­ని­కి తీ­సు­కు­రా­ను­న్నా­రు. ఈ ప్రా­జె­క్ట్ ఉత్త­రాం­ధ్ర రూ­పు­రే­ఖ­ల­ను మా­ర్చే గేమ్ ఛేం­జ­ర్ అవు­తుం­ద­ని, రా­ష్ట్రం­లో ఏవి­యే­ష­న్ క్ల­స్ట­ర్ అభి­వృ­ద్ధి­ని మరింత వే­గ­వం­తం చే­స్తుం­ద­ని అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఏవి­యే­ష­న్ రం­గా­న్ని కొ­త్త పుం­త­లు తొ­క్కిం­చే ది­శ­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం కీలక అడు­గు­లు వే­స్తోం­ది. నారా లో­కే­శ్ పై ప్ర­శం­సల జల్లు కు­రు­స్తోం­ది.

Tags:    

Similar News