అయ్యన్న చేసిన ఆరోపణలపై స్పందించిన మంత్రి జయరాం
ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్తీక్ ముద్దాయి అని ముందు మాకు తెలుసా?;
అయ్యన్న చేసిన ఆరోపణలపై మంత్రి జయరాం వింత వాదన చేశారు. ఏ14 కార్తీక్, తన కుమారుడు హైదరాబాద్‌లో కలిసారని అన్నారు. కారు కొన్నాను.. నీ చేతులతో కీస్ ఇస్తే బాగుంటుంది అని కార్తీక్ కోరితే తన కుమారుడు ఈశ్వర్ కీ ఇచ్చాడని చెప్పారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్తీక్ ముద్దాయి అని ముందు మాకు తెలుసా? అంటూ టీడీపీని ఎదురు ప్రశ్నించారు.