AP : కొడుకు కోసం స్కూల్ కు నారా లోకేష్.. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి..
పాలనా వ్యవహారాలతో ఎప్పుడూ బిజీ గా ఉండే ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కాసేపు తన5 కుటుంబానికి సమయం ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలను పక్కన పెట్టి తన కుమారుడు చదువుతున్న స్కూల్ కి వెళ్ళారు. పిల్లలు చదువుల్లో ప్రతిభ చూపించాలంటే తల్లితండ్రుల చొరవ తప్పకుండా ఉండాలని చెప్పేందుకే తాను స్కూల్లో జరిగే సమావేశం లో పాల్గొన్నట్లు తెలిపారు లోకేష్.
కాగా మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న స్కూల్ లో జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్ కు హాజరయ్యారు. భార్య బ్రాహ్మణితో కలిసి వెళ్లిన ఆయన... ఫ్యామిలీ తో ఉన్న ఫొటోను తన 'ఎక్స్' ఖాతాలో షేర్ చేశారు. ఎంత బిజీ గా ఉన్నా ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించి అందరికి ఆదర్శంగా నిలిచారు మంత్రి లోకేష్. "ప్రజా జీవితంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో.. ఇలాంటి క్షణాలు చాలా ప్రత్యేకం. దేవాంశ్ నువ్వు చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్నిస్తాయి. నిన్ను చూసి గర్వపడుతున్నా" అని లోకేశ్ ట్వీట్ లో రాసారు.