Minister Nara Lokesh : మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఆంధ్రరత్న ఎత్తిపోతలకు మరమ్మతులు

Update: 2025-08-29 11:00 GMT

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఉన్న ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకంకు మరమ్మతులు చేయించారు. సుమారు రూ. 8 లక్షల 50 వేలతో తుప్పుపట్టిన 150 హెచ్‌పీ మోటార్లకు మరమ్మతులు చేయించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక కూటమి నాయకులు గురువారం నూతన మోటార్లను స్విచ్ ఆన్ చేసి సాగునీటిని విడుదల చేశారు. దీనితో రైతులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ మాట్లాడుతూ మోటార్లకు మరమ్మతులు చేయడంతో కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, చిర్రావూరు గ్రామాల్లోని 3700 ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. 2 వేల మంది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎత్తిపోతల పథకం స్కీం యొక్క సమస్యను రైతులు, స్థానిక నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా లక్షల విలువైన సొంత నిధులతో మరమ్మతులు చేయించడంతో గొప్ప విషయమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలను మంత్రి నారా లోకేష్ అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కుల, మతాలు, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత పాలకులు తుప్పుపట్టిన పైపులను కూడా మార్చలేకపోయారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి ఆదుకుంటుందన్నారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు దాసరి కృష్ణ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి లాల్ చంద్, నీటి సంఘం అధ్యక్షురాలు మెడూరి ధనలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రధాన కార్యదర్శులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News