Minister Narayana : కాకినాడ జిల్లాలో మంత్రి నారాయణ పర్యటన

Update: 2025-07-16 11:45 GMT

కాకినాడ జిల్లా సామర్లకోటలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలోన 36 లక్షలతో నిర్మించిన గడియారపు స్తంభాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లు వైసీపీ రాష్ట్రాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు.

గత ప్రభుత్వంలో గడియారపు స్తంభం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి గడియారం స్తంభం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

Full View

Tags:    

Similar News