పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు : ఎంపీ రఘురామ
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చొరవచూపి ప్రధానితో మాట్లాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.;
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవైటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చొరవచూపి ప్రధానితో మాట్లాడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంలో రాజీపడితే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీలో రేషన్ డోర్ డెలీవరీలో తలెత్తుతున్న ఇబ్బందులపైనా రఘురామకృష్ణరాజు సటైర్లు వేశారు. వ్యాన్‌ల వద్ద ప్రజల్ని పడిగాపులు పడేలా చేస్తున్నారని ఇకనైనా లోటుపాట్లపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొట్టి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.