రామయణంలో మందర, శకుని పాత్ర విజయసాయిరెడ్డిది : ఎంపీ రఘురామ
విజయసాయిరెడ్డిది రామయణంలో మందర, శకుని పాత్ర అని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు.;
విజయసాయిరెడ్డిది రామయణంలో మందర, శకుని పాత్ర అని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం దొంగలెక్కలు చేయటంలో ఘనాపాటి అని మండిపడ్డారు. వ్యక్తిత్వ స్థాయి గురించి మాట్లాడే అర్హత విజయసాయికి లేదని స్పష్టం చేశారు. తలకాయ ఉన్న ఒక్కడిని పెట్టుకోమని జగన్‌కి సూచిస్తున్నాని అన్నారు. ఏం మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి ? ఎప్పుడు మాట్లాడాలన్నది? జగన్, విజయసాయిరెడ్డి ఆలోచించుకోని మాట్లాడాలని సూచించారు. నా అనర్హత గురించి మాట్లాడేవారు 10 వ షెడ్యూల్ ఒకసారి చదవండని రఘురామ పేర్కొన్నారు.