Nara Lokesh : ప్రజలే పరమావధిగా యువగళం 33వ రోజు
ఉదయం 11 గంటలకు కొత్తపేట బహిరంగసభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజికవర్గీయులతో సమావేశంకానున్నారు;
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్.. స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు. లోకేష్ వెనుక పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అడుగులోఅడుగు వేస్తున్నారు. ప్రతీ గ్రామంలో మహిళలలు లోకేష్‌కు మంగళహారతులు పడుతున్నారు.
ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ 33వ రోజు ఉదయం 10గంటలకు కొమ్మిరెడ్డిపల్లి విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఉదయం 11 గంటలకు కొత్తపేట బహిరంగసభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజికవర్గీయులతో సమావేశంకానున్నారు. ఒంటిగంట 45నిమిషాలకు మంగళంపేట సెంటర్‌లో స్థానికులతో ముచ్చ టించనున్నారు. విరామ అనంతరం సాయంత్రం 5గంటల 30నిమిషాలకు మొప్పిరెడ్డిగారి పల్లిలో స్థానికులతో భేటీ కానున్నారు. సాయంత్రం 6గంటల 35నిమిషాలకు పులిచర్లలో ఎస్సీ వర్గీయులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. రాత్రి 7గంటల 40నిమిషాలకు కొక్కువారిపల్లి విడిది కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రి లోకేష్ అక్కడే బస చేస్తారు.